బన్నీతో చిందేయనున్న దిశాపటాని!

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. ఫస్ట్లుక్, టీజర్ తో సంచలనం రేకెత్తించిన ఈ సినిమా షూటింగ్ కి కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడింది. అల్లుఅర్జున్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇక ఈ సినిమాలో అద్భుతమైన ఐటమ్ సాంగ్ ఉంది. అందులో బన్నీతో కలసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశాపటాని చిందేయబోతోందట. ఈ విషయాన్ని దిశానే ప్రకటించింది.

ఇంటర్ నేషనల్ డాన్స్ డే సందర్భంగా మీడియాతో మాట్లాడింది దిశా. పుష్ప సినిమాలో తాను స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు రివీల్ చేసింది. ఇటీవల సల్మాన్ తో కలిసి ‘రాధే’లో సీటీమార్ సాంగ్ లో స్టెప్పేసింది దిశాపటాని. ‘సీటీమార్’ ఒరిజినల్ లో అల్లు అర్జున్ డాన్స్ చూసి ఫిదా అయిపోయానంటూ బన్నీ, హృతిక్ తనకు నచ్చిన డాన్సింగ్ హీరోలు అని చెప్పింది దిశా. బన్నీ మూమెంట్స్ మామూలుగా ఉండవని గతేడాది వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ‘బుట్టబొమ్మ’ పాట కూడా తనకెంతగానో నచ్చిందంటోంది. బన్నీ పాట ‘సీటీమార్’కి డాన్స్ చేయటం ఓ అద్భుతం అయితే తనతో కలసి ‘పుష్ప’ సినిమాలో స్టెప్పేయబోవటం మహాద్భుతంగా వర్ణిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates