Homeతెలుగు Newsమెగాస్టార్ కోసం మహేష్ బాబు

మెగాస్టార్ కోసం మహేష్ బాబు

Mahesh Babu Gives a Boost to Acharya's Promotions

మెగాస్టార్ చిరంజీవి-కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి కి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో మనం చూస్తే చిరంజీవి మునుపటిలా ఫుల్ ఎనెర్జిటిక్ గా కనిపిస్తున్నారు, పైగా ఈ చిత్రం మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కామియో రోల్ లో నటించడంతో ఈ చిత్రం పై ఇంకా అంచనాలు తారా స్థాయికి చేరాయి.

తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందిస్తున్నారట, ఇది దాదాపుగా ఖరారైందని ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నట్లు సినీ వర్గాలు చెప్పుతున్నారు. మహేష్ బాబుకి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు. ఇక ఆ చిత్రం పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మహేష్ బాబుకి దర్శకుడు కొరటాల శివ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీకి మహేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. తప్పకుండా మహేష్ వాయిస్ ఓవర్ తో ఆచార్య చిత్రానికి ఎక్స్ట్రా మైలేజి యాడ్ కానుంది.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మొదటి వారం కలెక్షన్లు..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu