చిరు సినిమా స్పూర్తితో ‘రంగస్థలం’?

రామ్ చరణ్, సుకుమార్ కంబినేషన్లో తెరకెక్కుతున్న, సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రంగస్థలం సినిమా. 1980లలో జరిగిన కథను చూపించబోతున్నామని, సుకుమార్ క్లియర్ గా చెప్పేశారు. ఇక చరణ్ ను కూడా పక్కా మాస్ లుక్స్ లో చూసి, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా కథ ఇప్పుడిప్పుడే బయటకు లీక్స్ వస్తున్నాయి. 1981లో విడుదలైన చిరంజీవి ఊరికిచ్చిన మాట సినిమా తరాలో ఈ సినిమా ఉండబోతుందట.

ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆధారంగా, సుకుమార్ ఈ సినిమాని అల్లుకున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటివరకు పూర్తి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ఆ లోటు రంగస్థలం భర్తీ చేసేలా కనిపిస్తుంది.