మహేష్ సినిమాలో నయన్..?

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో
హీరోయిన్ గా ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారు. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన
పాత్ర ఉందట. దానికోసం నయనతార అయితే బావుంటుందని భావించిన మురుగదాస్ ఆమె
కోసం ఆ పాత్రలో మరింత వైవిధ్యాన్ని జోడించి ఆమెకు వినిపించడం జరిగింది. కథ, తన పాత్ర
నచ్చడంతో నయనతార వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో కూడా నయనతార, మురుగదాస్
దర్శకత్వంలో వచ్చిన ‘గజిని’ సినిమాలో కనిపించింది. ఆ అనుబంధంతోనే ఈ సినిమాలో
నటించడానికి అంగీకరించింది. ఆమె పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates