HomeTelugu Trendingఖరీదైన కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్‌ బాబు

ఖరీదైన కారుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్‌ బాబు

MaheshBabu as Brand Ambass

సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో ఖరీదైన యాడ్ పడింది. మహేష్ అత్యంత ఖరీదైన కారు ఆడి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఆడి తాజా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రమోట్ చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదలైన రెండు పాటలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu