HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండకు తండ్రిగా సురేష్‌ గోపీ

విజయ్‌ దేవరకొండకు తండ్రిగా సురేష్‌ గోపీ

Malayalam actor suresh gopi

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకి ‘ఫైటర్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈమూవీ షూటింగ్‌ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఫైటర్‌’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.

పాన్‌ ఇండియన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నడుటు సురేష్‌ గోపీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌ తండ్రి పాత్రలో ఆయన నటించనున్నట్లు సమాచారం. ‘ఫైటర్‌’ చిత్రంలో తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ ముఖ్య భూమిక పోషించనున్న క్రమంలో.. సదరు పాత్రకు సురేశ్‌ గోపీ అయితే సరిపోతారని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు ఆయనను సంప్రదించగా.. ‘ఫైటర్‌’లో నటించేందుకు ఆయన కూడా ఆసక్తికనబరిచారని పలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu