HomeTelugu Trendingమంచు లక్ష్మి 'చిట్టి చిలకమ్మ' యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌

మంచు లక్ష్మి ‘చిట్టి చిలకమ్మ’ యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌

Manchu Lakshmi YouTube chan

మంచు లక్ష్మి యూట్యూబ్ లో తన కూతురుతో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్ ఛానెల్ లో పిల్లలకు అవగాహణ కల్పించేందుకు పలు వీడియోలను చేస్తూ వస్తోంది. చదువుతో పాటు సామాజిక అంశాలను పిల్లలకు ఎలా తల్లిదండ్రులు నేర్పించాలి ఈ తరం పిల్లలతో ఎలా మెలగాలి అనే విషయాలను మంచు లక్ష్మి చెబుతూ మంచి పేరును దక్కించుకుంది. తల్లి కూతుర్లు కలిసి చేసే వీడియోలకు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి.

ఈసమయంలో చిట్టి చిలకమ్మ యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేశారట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి స్వయంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. గుర్తు తెలియని హ్యాక్స్ తన యూట్యూబ్ ఛానెల్ ను హ్యాక్ చేశారు. ప్రస్తుతం తన టీమ్ ఆ ఛానెల్ ను రికవరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు చిట్టి చిలకమ్మ ఛానెల్ వస్తుంది అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu