HomeTelugu Trending'ఆవిరి' టీజర్‌.. ఆ ఆత్మ మీకు కనిపించిందా?

‘ఆవిరి’ టీజర్‌.. ఆ ఆత్మ మీకు కనిపించిందా?

9 22ప్రముఖ దర్శకుడు రవిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమా టీజర్‌ను శనివారం సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. రాజ్‌కుమార్‌ కుటుంబం ఈ ఇంట్లో ఉంటుంది. వారితోపాటు ఈ ఇంట్లో ఓ ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మ మీకు కనిపించిందా?’ అనే టైటిల్స్‌తో ‘ఆవిరి’ టీజర్‌ ప్రారంభమవుతుంది. టేబుల్స్‌ ఉన్నట్టుండి కదలడం.. ఆవిరిలోంచి చేతులు రావడం.. ఇలాంటి సన్నివేశాలు భయపడేలా చేస్తాయి. సన్నివేశాలకు తగ్గటుగానే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.

టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘ఏ ఫ్లైయింగ్‌ ఫ్రాంగ్స్‌ ప్రొడక్షన్‌’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నెహా చౌహాన్‌, శ్రీముక్తా, భరణిశంకర్‌, ముక్తర్‌ ఖాన్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu