HomeTelugu Trendingరామ్‌ చరణ్‌తో మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రెషన్స్‌

రామ్‌ చరణ్‌తో మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రెషన్స్‌

Manchu laxmi and manoj diwaటాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ దీపావళి పర్వ దినాన్ని తన ఇండస్ట్రీలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అయిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో జరుపుకున్నారు. మనోజ్‌ తన సోదరి మంచు లక్ష్మీ, రామ్‌ చరణ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ ఫోటోలను మనోజ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దీపావళి పండుగ జరపుకోవడం సంతోషంగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు దీపావళి అనంతరం వచ్చే భగినీ హస్త భోజనం(భాయ్‌ దూజ్‌) వేడుకలను మంచు లక్ష్మీ ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు తమ్ముళ్లతో (విష్ణు, మనోజ్‌) కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. సోదరులకు భాయ్‌ దూజ్‌ శుభాకాంక్షలు తెలుపుతూ మంచు విష్ణు, మనోజ్‌లే తనక బలమని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu