HomeTelugu Big Stories25 వేల కుటుంబాలకు సాయం చేయనున్న మంచు మనోజ్‌

25 వేల కుటుంబాలకు సాయం చేయనున్న మంచు మనోజ్‌

Manchu Manoj helps to 25 th

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే పుట్టినరోజు వేడుకలకు ఆయన దూరంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రోజున ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. COVID-19 బారిన పడ్డ 25 వేల కుటుంబాలకు 13 రకాల వేర్వేరు గృహ నిత్యావసరాలను అందిస్తానని మనోజ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ గొప్ప మిషన్ లో మనోజ్ తో అతని అభిమానుల బృందం చేరారు.

ముందుగా మన ప్రాణాల్ని కాపాడటానికి వాళ్ల ప్రాణాలని, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరినీ కాపాడుతున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ సానిటైజ్‌ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి.

నా వంతుగా ఈ పుట్టినరోజున నేను నా అభిమానులు, మిత్రులు కలిసి కోవిడ్‌ వల్ల ప్రభావితం అయిన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం” అని రాసుకొచ్చాడు. మాస్కులు ధరించడం.. క్రమం తప్పకుండా శుభ్రపరచడం.. శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా తమను తాము మెరుగుపరుచుకోవాలని జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనోజ్ కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu