HomeTelugu Trendingఒక ప్రముఖ హీరోనే మాపై ట్రోలింగ్స్‌ చేయిస్తున్నాడు: మంచు విష్ణు

ఒక ప్రముఖ హీరోనే మాపై ట్రోలింగ్స్‌ చేయిస్తున్నాడు: మంచు విష్ణు

Manchu vishnu commments on

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈ సినిమా ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంలో మంచు ఫ్యామిలీపై జరుగుతున్న ట్రోల్స్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ ట్రోల్స్ వెనుక ఒక హీరో ఉన్నాడని కొంత కాలంగా విష్ణు చెబుతూ వస్తున్నాడు. అందువలన ‘ఆ హీరో ఎవరో బయటపెట్టే ఉద్దేశమేదైనా ఉందా?’ అంటూ ఆయనను అడిగారు.

అందుకు విష్ణు స్పందిస్తూ .. ‘మా’ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన దగ్గర నుంచే ట్రోల్స్ మొదలయ్యాయి. ఒక మేధావి కూర్చుని మనుషులను పెట్టి చేయిస్తున్నాడు. చేయిస్తూనే ఉంటాడు కూడా. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని నేను చెబుతూ వస్తున్నాను. ఆ హీరో ఎవరనేది ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. మీడియావారికి కూడా తెలుసు. ఆ హీరో ఎవరిరో తెలియదని ఎవరైనా అంటే వారు ట్రెండ్ లో లేనట్టు” అన్నాడు.

“నా చుట్టూ ఉన్న ఇరవైమంది నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చుంటే గమ్యానికి చేరుకోలేను. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా నేను ముందుకు వెళుతూనే ఉంటాను. ఇక ‘జిన్నా’ విషయానికి వస్తే, ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది… అంటూ చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu