మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు


హీరో మంచు విష్ణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు ప్రకటించారు. రుయా ఆస్పత్రిలో సౌకర్యాలను మెరుగుపరచడానికి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు విష్ణు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన తొలి చెక్‌ను నేడు అందజేసినట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. సేవా కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో నిలిచే మంచు విష్ణు దేశ, విదేశాల్లోని ఆర్టిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచు విష్ణు ఆర్ట్‌ ఫౌండేషన్‌ను ఆయన ప్రారంభించిన సంగతి తెలిసిందే.