HomeTelugu Big Storiesభావోద్వేగానికి గురైన మంచు విష్ణు

భావోద్వేగానికి గురైన మంచు విష్ణు

Manchu Vishnu Emotional
మా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. మా ఎన్నికలు ఇంతదూరం వచ్చి ఉండకూడదు అన్నారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. ప్రత్యర్థిగా పోటీచేసిన ప్రకాష్‌రాజ్‌ను కౌగిలించుకుని కంటతడిపెట్టారు. మేమంతా ఒకే కుటుంబం.. కలిసి పనిచేస్తాం అని మంచు విష్ణు అన్నారు. ఇది తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం అన్నారు.

మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. మంచు విష్ణుతో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన శ్రీకాంత్ మిగతా విజేతలందరికీ పేరు పేరునా అభినందనలు. నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. మా ఎప్పటికీ ఒకే కుటుంబం. ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే అన్నారు. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాని అన్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త కమిటీ సభ్యులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu