పూరి అరెస్ట్ తప్పదా..?

డ్రగ్స్ వివాదంలో సిట్ విచారణను ఎదుర్కొన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ను శనివారంలోపు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేసింది కూడా పూరి అని పక్కాగా ఆధారాలు సేకరించడంతో ఇది పూరి అరెస్ట్ కు దారి తీస్తుందని అంటున్నారు. అంతేకాదు పూరి డ్రగ్స్ తీసుకుంటున్నాడనే అనుమానంతో ఆయన రక్త నమూనా, వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకు పంపించారు అధికారులు. పూరి డ్రగ్స్ వాడుస్తున్నట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో గనుక వెల్లడైతే
ఈ కేసులో బలమైన సాక్ష్యంగా మారుతుందని భావిస్తున్నారు.

పూరి విదేశాల నుండి తెప్పించే డ్రగ్స్ ను తనతో పాటు, ఛార్మీ, ముమైత్ ఖాన్ లకు అందించేవాడని నటుడు సుబ్బరాజు వెల్లడించినట్లు సమాచారం. ఈ సాక్ష్యంతో పూరి అరెస్ట్ తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూరి జగన్నాథ్ ను విచారించిన రోజే అతడిని అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీనికి తగ్గట్లుగా సాయంత్రం 5 గంటలకే ముగుస్తుందనుకున్న విచారణ రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఆ తరువాత సిట్ అధికారులు ఆయనను విడిచిపెట్టారు. కేవలం ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసమే ఎదురుచూస్తున్నామని రాగానే సినీ ప్రముఖుల అరెస్ట్ ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.