HomeTelugu TrendingKannappa: బాణం ఎక్కుపెట్టిన మంచు విష్ణు

Kannappa: బాణం ఎక్కుపెట్టిన మంచు విష్ణు

Manchu vishnu first look fr
kannappa: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రోజెక్ట్‌ ‘కన్నప్ప’ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. ఈ సినిమాలో మొదలు పెట్టిన్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మోహ‌న్ బాబు నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా వస్తున్న ఈ సినిమా నుండి ఈరోజు ‘మ‌హాశివ‌రాత్రి ‘ కానుక‌గా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.

ఇక ఈ ఫ‌స్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్రీతి ముఖుంధన్ నటిస్తుంటే ప్రభాస్, మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. వంటి భారీ స్టార్ కాస్ట్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నారట. పార్వతీ దేవిగా నయనతార నటించబోతున్నారని తెలుస్తుంది. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇండియాకు తిరిగొచ్చింది. తాజా సమాచారం ప్రకారం మార్చిలో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో ప్రభాస్‌ జాయిన్‌ కానన్నుట్లు తెలుస్తుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu