HomeTelugu Trendingతిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం: మంచు విష్ణు

తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం: మంచు విష్ణు

Manchu vishnu meets AP cm

సీఎం జగన్‌ను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత అంశాల గురించి మాత్రమే సీఎం జగన్‌ను కలిశా. సీఎంతో భేటీకి సీనియర్‌ నటుడు మోహన్‌బాబుకు ఆహ్వానం అందింది. కానీ కొందరు అందకుండా చేశారు. సినిమా టికెట్‌ల గురించి, ఇతర అంశాల గురించి ఫిల్మ్‌ ఛాంబర్‌లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నా సినిమా వాళ్లంతా ఒకే కుటుంబం. విభేదాలను అంతర్గతంగా పరిష్కరించుకుంటాం. సినిమా వాళ్లకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండు కళ్లు లాంటివి.అందరు తెలుగువాళ్లు మాకు కావాలి.

ఏపీలో సినిమా స్టూడియోలకు స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషకరం. కొంతమేర సినీ పరిశ్రమ తరలి వచ్చేందుకు విశాఖ అనువైన ప్రాంతమే. తిరుపతిలో సినిమా స్టూడియో నిర్మిస్తాం. ఏసియాలోనే బెస్ట్‌ పిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేస్తా. ఇక తాజాగా నేను చేసిన ట్వీట్‌పై కొందరు కావాలనే రాద్దాంతం చేశారు. దయచేసి దుష్ప్రచారం చేయొద్దు’ అని విష్ణు తెలిపారు.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu