HomeTelugu Trending'మంగళవారం' ట్రైలర్

‘మంగళవారం’ ట్రైలర్

 

Mangalavaaram Teaser‘ఆర్ఎక్స్100’ దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ కలిసి చేసిన కొత్త సినిమా ‘మంగళవారం’. టైటిల్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ‘ఫియర్ ఇన్ ఐస్’ కళ్లలో భయం అనే పేరుతో టీజర్ను విడుదల చేశారు మేకర్స్.

ఈ టీజర్‌ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్ చివరికి వచ్చేసరికి ఎవరో ఓ వ్యక్తి ముఖానికి అమ్మవారి మాస్క్ వేసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ తర్వాత చివరికి అమ్మవారి విగ్రహాన్ని మాస్క్ను మరోసారి చూపించి ముగించారు. కానీ ఆ వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదు.

అయితే అన్నింటికన్నా ఎక్కువగా కాంతార ఫేమ్ బి అజనీశ్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. ఇకపోతే ‘ఆర్ఎక్స్100’ ‘మహా సముద్రం’ సినిమాల తర్వాత అజయ్‌ భూపతికి ఇది మూడో సినిమా. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తైందని సమాచారం. ఇందులో పాయల్ రాజ్ పుత్తో పాటు అజయ్ ఘోష్ లక్ష్మణ్ చైతన్య కృష్ణ మరి కొంతమంది ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu