HomeTelugu Trending'ది ఫ్యామిలీ మ్యాన్-2' ట్రైలర్ వచ్చేస్తోంది

‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ట్రైలర్ వచ్చేస్తోంది

Samantha Web series
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో మనోజ్‌బాజ్‌పాయ్, ప్రియమణి, గుల్ పనాగ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ రాబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రావల్సి వుండగా అది వాయిదా పడింది. వచ్చేనెలలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశముంది. ఇందులో ప్రముఖ హీరోయిన్ సమంత ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. అందుకే ఈ వెబ్‌సిరీస్‌పై మరింత ఆసక్తి నెలకొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu