HomeTelugu Big Storiesసమంత నటించిన తొలి వెబ్‌సిరీస్ త్వరలోనే..

సమంత నటించిన తొలి వెబ్‌సిరీస్ త్వరలోనే..

samantha webseries
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత నటించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సమంత వెబ్‌ సిరీస్ అలరించనుంది. బాలీవుడ్ నటుడు బాజ్‌పాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత కీలక పాత్ర చేసింది. 2019 సెప్టెంబర్‌లో వచ్చిన ‘ద ఫ్యామిలీ మ్యాన్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా ద ఫ్యామిలీ మ్యాన్-2ని రూపొందించారు దర్శక, నిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ వెబ్‌సిరీస్ అందుబాటులో ఉంటుంది. సమంత గ్లామరస్ పాత్రలతో పోలిస్తే ఇందులో డిఫరెంట్‌గా కనిపించనుంది. సమంతకు ఇది తొలి వెబ్ సిరీస్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu