HomeTelugu Trending'మార్టిన్‌ లూథర్‌ కింగ్‌' టీజర్

‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ టీజర్

Sampoornesh Babu is back with Martin Luther King teaser out now

సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఓ గ్రామంలో జరిగే పొలిటికల్ కామెడీ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఈ సినిమా తమిళంలో హిట్టయిన ‘మండేలా’ చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. తమిళ వెర్షన్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్ర పోషించారు.

‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టయిన్ మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రం అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో సీనియర్ నటుడు నరేశ్, శరణ్య ప్రదీప్, వెంకటేశ్ మహా తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu