HomeTelugu Big Storiesమెగాస్టార్‌ '154'సినిమాలో జాయినైన రవితేజ

మెగాస్టార్‌ ‘154’సినిమాలో జాయినైన రవితేజ

Mass Maharaja Joins in Mega
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న153వ మూవీ ‘గాడ్ ఫాదర్’. మోహన్ రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక ముఖ్యమైన పాత్రలో రవితేజ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన తప్పుకున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.

మొత్తానికి ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టుగా .. షూటింగులో జాయిన్ అయిన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్ పట్ల ఆసక్తిని రేకెత్తిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేశారు. మెగాస్టార్ కారవాన్ లోకి రవితేజ ఎంటరైనట్టుగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టుగా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu