HomeTelugu Trending'వాల్తేరు వీరయ్య' రవితేజ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ విడుదల

‘వాల్తేరు వీరయ్య’ రవితేజ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ విడుదల

Mass Maharaja Ravi Teja Fir
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటిస్తున్నారు. దాంతో, అటు మెగా ఫ్యాన్స్ తో పాటు రవితేజ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మెగా మాస్ సాంగ్ అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు సినిమాలో రవితేజ పాత్రను చిరంజీవి పరిచయం చేశారు. ‘అతని బ్యాక్ గ్రౌండ్ కేవలం హార్డ్ వర్క్. అతని సపోర్ట్ ప్రేమించే మాస్’ అంటూ ట్విట్టర్ లో కొనియాడారు.

మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర ఫస్ట్ లుక్ తో పాటు ఆయన పాత్రను పరిచయం చేసే టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఓ చేతిలో మేకపిల్ల, మరో చేతిలో గొడ్డలి పట్టుకొని విలన్లతో ఫైట్ చేస్తూ రవితేజ పుల్ యాక్షన్ లో మోడ్ లో కనిపించారు. ‘ఫస్ట్ టైమ్ ఒక మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తాంది’ అంటూ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. ఈటీజర్‌ నెటిజన్లు ఆకట్టుకుంటుంది. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu