HomeTelugu Trending‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూన్న బుజ్జిగాడు

‘నీతోని కష్టమే కృష్ణవేణి’ అంటూన్న బుజ్జిగాడు

12 10
రాజ్‌ తరుణ్ హీరోగా.. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్‌ రాసిన కృష్ణవేణి పాటను బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌
కథానాయికలుగా నటిస్తున్నారు.

లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘కృష్ణవేణి ఓ కృష్ణవేణి నీతోని కష్టమే కృష్ణవేణి, కానీ నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి’ పాట యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక ఈ సినిమా నుంచి ‘కురిసేన.. కురిసేన.. తొలకరి వలపులె మనసున’ అనే పాట ఇదివరకే విడుదలైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu