మెసేజ్, ఎంటర్టైన్మెంట్ కలగలిపిన ‘డొనరుడు’!

అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను అక్కినేని నాగార్జున విడుద‌ల చేయగా తొలి సీడీని అక్కినేని అఖిల్ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా…
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. ”హిందీలో విడుదలైన విక్కీ డోనార్‌ని ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. సుమంత్ చాలా రోజుల త‌ర్వాత మంచి స్క్రిప్ట్ తో వ‌స్తున్నాడు. చ‌క్క‌టి కామెడీ రోల్‌ని చేశాడు. బావుంటుంద‌ని న‌మ్మి చేశాడు. ఈ సినిమాలో మెసేజ్ ఉంది. ఎంట‌ర్‌టైన‌ర్ ఉంది. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం అనే కాన్సెప్ట్ పై సినిమాను తెర‌కెక్కించారు. పిల్లలు పుట్టే సమయంలో భార్య భర్తలు మధ్య భ‌యాలు, కాంప్లెక్స్ లు వంటి వాటికి సంబంధించిన సినిమా. ఇప్పటి రోజుల్లో మెసేజ్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌లిసి ఉన్న సినిమాలు రావ‌డం క‌ష్టమైపోయాయి. కానీ ఈ సినిమాకు కుదిరాయి. కొత్త‌గా ఉన్న‌ప్పుడు ఏ క‌థ‌నైనా నేను కాద‌న‌ను. ఇలాంటి క‌థ నాకు వ‌చ్చినా చేసేవాడిని. ఇప్పుడు న‌మో వేంక‌టేశా చేస్తున్నా. ఆ త‌ర్వాత కూడా న్యూ జాన‌ర్‌లో ట్రై చేద్దామ‌ని ఓ క‌థ విన్నా. అది విన్న‌ప్ప‌ట నుంచి నిద్ర కూడా ప‌ట్ట‌లేదు. అంత బావుంది” అని అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ.. ”చాలా డిఫరెంట్ మూవీ తెలుగులో ఇలాంటి సినిమా చేయాలంటే గ‌ట్స్ కావాలి. ఇలాంటి క‌థ‌తో సినిమా చేయాల‌ని నాకూ ఉన్నా నేను చేయ‌లేను. సుమంత్ చాలా మంచి స‌బ్జెక్ట్ తో ముందుకొస్తున్నాడు. హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను” అని చెప్పారు.
యూత్ సహా అందరికీ నచ్చే సినిమా
సుమంత్ మాట్లాడుతూ.. ”గోల్కొండ హైస్కూల్ సినిమా చేసేట‌ప్పుడు రామ్మోహ‌న్ నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చేయ‌మ‌ని ఐడియా ఇచ్చారు. ఆయ‌న వ‌ల్లే ఈ క‌థ‌ను చూజ్ చేసుకుని చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నాను. ఈ సినిమాలో కామెడీ ఉంది. యువ‌త‌ సహా అందరికీ సినిమా న‌చ్చేలా ఉంటుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. మంచి సినిమాతో మ‌ర‌లా వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాణ విలువ‌లు బావుంటాయి. న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేస్తున్నాం” అని అన్నారు.
నిర్మాత సుధీర్‌ మాట్లాడుతూ.. ”సుమంత్‌తో ఇంకో సినిమా కూడా చేయాల‌ని ఉంది. అంత బాగా కోఆప‌రేట్ చేశారు” అని తెలిపారు.
ద‌ర్శ‌కుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. ”సుమంత్ గారు ఫోన్ చేసి విక్కీ డోన‌ర్ చూశావా అన్నారు. అప్ప‌టికి చూడ‌లేదు. చూసి ఆయ‌న‌కు ఫోన్ చేశాను. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా చేశాను. మ్యూజిక్‌, కెమెరా, ఎడిటింగ్ కూడా సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. విక్కీ డోన‌ర్‌ని మ‌న నేటివిటికీ తేవ‌డం క‌ష్టం. అయినా నేటివిటీ మిస్ కాకుండా తెర‌కెక్కించాం” అని తెలిపారు.
సంగీత ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ”8 పాట‌లున్నాయి. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రిస్తాయి” అని చెప్పారు.
సుశాంత్ మాట్లాడుతూ.. ”సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని `యు` స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. కొత్త కోణంలో ఉంది. స్టైల్ అదిరిపోతుంది సుమంత్‌ది” అని అన్నారు.