బోయపాటి కొత్త సినిమా ప్రారంభం!

డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం.2 చిత్రం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో సినిమా కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి త‌న‌య మిర్యాల ద్వార‌క‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న‌య బోయ‌పాటి జోషిత క్లాప్ కొట్ట‌గా, తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను త‌న‌యుడు మాస్ట‌ర్ బోయ‌పాటి హ‌ర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు.  ఈ సంద‌ర్భంగా… చిత్ర‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ”ఈ సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఈ నవంబ‌ర్ 16నుండి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్ర‌సాద్‌గారి సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం” అన్నారు.
ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను.
 
CLICK HERE!! For the aha Latest Updates