HomeTelugu Trendingవిక్రమ్: మత్తుగ మత్తుగా లిరికల్‌ వీడియో విడుదల

విక్రమ్: మత్తుగ మత్తుగా లిరికల్‌ వీడియో విడుదల

Mathuga Mathuga Lyric from
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. ఖైదీ మాస్టర్ వంటి విభిన్న యాక్షన్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజ్ కమల్ ఇంటర్నేషన్ బ్యానర్ పై కమల్ నటిస్తూ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన చిత్రమిది. ఇందులో కమల్ రా ఏజెంట్ విక్రమ్ గా కనిపించబోతున్నారు. కీలక పాత్రల్లో విజయ్ సేతుపతి ఫహాద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. హీరో సూర్య కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్న ఈమూవీని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా జూన్ 3న విడుదల కానుంది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది.

ఈ మూవీని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగులోనూ ఈ మూవీ భారీగా హంగామా చేయడం మొదలు పెట్టింది. మూవీ విడుదల తేదీ దగ్గరపడుడటంతో.. మ్యూజికల్ హడావిడి మొదలు పెట్టారు. ఇందులో భాగంగా హీరో కమల్ హాసన్ సంగీత దర్శకుడు అనిరుధ్ కలిసి ఆలపించిన ‘మత్తుగ మత్తుగా’ అంటూ సాగే సాంగ్ కు సంబంధించిన ఫస్ట్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటని చంద్రబోస్ రాశారు. కమల్ తో కలిసి అనిరుథ్ ఆలపించారు. ఈ పాటుకు అనిరుథ్ నాటు బీటుతో అదరగొట్టిట్టాడు. జూన్ 3న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu