అక్కినేని ఫ్యామిలీ నుండి మరో మల్టిస్టారర్‌!

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగర్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్ 4’ వ్యవహరిస్తునే మరోపక్క ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తూ.. బీజీగా ఉన్నాడు. అయితే త్వరలో నాగ్‌ ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో ఆయన తనయుడు అఖిల్ కూడా మరో హీరోగా నటిస్తారని సమాచారం. ఇటీవల మహేష్‌ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరూ’ హిట్ చిత్రాన్ని చేసిన అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజక్టుకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇటీవల నాగార్జునను కలసిన అనిల్ రావిపూడి దీనికి సంబంధించిన కథను వినిపించాడట. నాగార్జునకు ఈ కథ బాగా నచ్చిందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు ఫిల్మ్‌నగర్లో వార్తలు వినిపిస్తోంది. అక్కినేని వారి మూడు తరాల నటులతో విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించిన ‘మనం’ సినిమా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున-అఖిల్ కలిసి నటించనున్నారన్న వార్త టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates