HomeTelugu Trending'మాయాబజార్‌ ఫర్‌ సేల్‌' ట్రైలర్‌

‘మాయాబజార్‌ ఫర్‌ సేల్‌’ ట్రైలర్‌

MayaBazaar For Sale Trailer

సీనియర్ నటుడు నరేష్ ఈషా రెబ్బ నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. జీ5తో పాటు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్ మీద దీనిని చిత్రీకరించారు.

ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విభిన్న కుటుంబాల కథగా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో శ్రీను, రామ్‌ ప్రసాద్‌, ఝాన్సీ, నవదీప్‌ తదితరులు నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu