HomeTelugu Trendingఉపాసన, నమ్రత శిరోద్కర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

ఉపాసన, నమ్రత శిరోద్కర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

 

Upasana and namrathaక్రిస్మస్ పండగను ఈ ఏడాది టాలీవుడ్ సెలబ్రిటీలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మరికొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

సెలబ్రిటీలకు నమ్రత ఫ్రెండ్ సబీనా జేవియర్ ఈ క్రిస్మస్ పార్టీ ఇచ్చింది. రామ్ చరణ్ భార్య ఉపాసన, డైరెక్టర్ నగేష్ కుకునూర్‌తో కలిసి నమ్రతా శిరోద్కర్ ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత తన పిల్లలు గౌతమ్, సితారతోనూ నమ్రత క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నారు. నమ్రత ఇన్‌స్టా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

క్రిస్మస్ పార్టీలో వీళ్లంతా రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయారు. మహేష్ బాబు కూతురు సితార కూడా తన క్రిస్మస్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితం నమ్రత, సితార కలిసి తన ఫ్రెండ్ ఇంట్లో క్రిస్మస్ కోసం కుకీలు తయారు చేసే సెషన్‌లోనూ పాల్గొన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu