
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా తనతోసహా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ‘2022లో మా ఇంటికి విచ్చేసిన తొలి అతిథి కరోనా. దానికి మా కుటుంబమంతా నచ్చింది. అయినా సరే దాన్ని మా ఇంట్లో ఉండనివ్వను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బాధ్యతగా వ్యవహరించండి. కరోనాను వ్యాప్తి చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, కొందరు సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది ‘దృశ్యం 2’, పెద్దన్న చిత్రాలతో అలరించిన మీనా ప్రస్తుతం ‘బ్రో డాడీ’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు.













