HomeTelugu Trendingకడుపు నింపుకోవడానికి ఒళ్ళు అమ్ముకుంటున్నారు ..

కడుపు నింపుకోవడానికి ఒళ్ళు అమ్ముకుంటున్నారు ..

Meera chopra

పవన్‌ కల్యాణ్‌ బంగారంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటి మీరా చోప్రా. ఈ మధ్య ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో బాగానే వినిపిస్తుంది. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయింది మీరా. టాలీవుడ్‌లో ఎప్పుడో కనుమరుగైన ఈమె ఇటీవల అనూహ్యరీతిలో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన దగ్గరనుంచి ఈ అమ్మడికి బాగానే ఫాలోయింగ్‌ పెరిగి పోయింది. ఇటీవల ముంబైలోని సెక్స్ వర్కర్లు దారుణమైన స్థితిలో ఉన్నారని.. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందించడం లేదని ఓ సోషల్ యాక్టివిస్ట్ పెట్టిన ట్వీట్‌పై స్పందించిన మీరా చోప్రా… ”కమాతిపుర అనే సిరీస్ లోనే నటించే క్రమంలో సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవన పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకోవడం అనేది అత్యంత బాధకరమైన విషయం” అని ఎమోషనల్ ట్వీట్ చేసింది మీరా చోప్రా .

Recent Articles English

Gallery

Recent Articles Telugu