HomeTelugu Big Storiesనిహారిక పెళ్లిలో మెగా హీరోలు.. ఫొటో వైరల్‌

నిహారిక పెళ్లిలో మెగా హీరోలు.. ఫొటో వైరల్‌

Mega Heroes in Niharika Pre
మెగా బ్రదర్‌ నిహారిక పెళ్లి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్ ప్యాలెస్‌లో ఈ రోజు బుధవారం (డిసెంబర్‌9) సాయంత్రం అత్యంత వైభవంగా వివాహం జరగనుంది. నిహారిక- చైతన్య ఇరు కుటుంబాలు.. వారికి చెందిన బంధుమిత్రులు రెండు రోజులు ముందుగానే అక్కడకు హాజరై సందడి చేస్తున్నారు.

ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నుండి పలు ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ సహా మెగా కుటుంబంలోని హీరోలంతా నిన్న సాయంత్రమే వేదిక వద్దకు చేరుకుని సందడి చేశారు. కుటుంబం మొత్తం పెళ్లి వేడుక కోసం ఉదయపూర్ చేరుకుంది. మంగళవారం సాయంత్రం నిహారిక మెహెంది వేడుక కన్నుల పండుగగా సాగగా ఈ ఈవెంట్ నుండి కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. ఈ ఫొటోల్లో సంథింగ్ స్పెషల్ ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మెగా యంగ్‌హీరోలంతా ఈ ఫోటోలో కనిపించారు. అకీరా నందన్ కూడా ఈఫొటోలో కనిపించాడు.ఈ ఫోటోలోనే కాబోయే హీరో.. నిహారిక హబ్బీ చైతన్య జొన్నలగడ్డ ఉన్నారు. చాలా కాలం తరువాత ఇలా మెగా-అల్లు ఫ్యామిలీ హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హీరోలంతా సాంప్రదాయక దుస్తులను ధరించారు.

Mega Heroes in Niharika 2

Mega Heroes in Niharika 1

Mega Heroes in Niharika 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu