రామ్‌ చరణ్‌ న్యూలుక్‌.. వైరల్


మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరో హీరోగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వీరికి జంటగా బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్, హలీవుడ్‌ హీరోయిన్‌ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో కాస్త విరామం దొరకడంతో రామ్ ఛరణ్ సేద తీరుతున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

“RAAM RAAM”

A post shared by Ram Charan (@alwaysramcharan) on