హీరో అర్జున్ అలా చేశాడట!

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు, తెలుగు, తమిళ హీరో అర్జున్‌పైనా ఓ నటి ఆరోపణలు చేసింది. అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని “నిబునన్‌” సినిమా సెట్‌లో అర్జున్‌ తనను వేధించారని నటి శ్రుతి హరిహరన్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నప్పటి నుంచి అనేకమార్లు లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాను. చాలా మంది మహిళలకు ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. మౌనం వీడాల్సిన సమయమిది. కెరీర్‌ ప్రారంభంలో ఎంతో ఉత్సాహంతో వచ్చా. కానీ ఈరోజు సినీ పరిశ్రమపై విరక్తి కలుగుతోందంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

సినీ ఇండస్ట్రీలో సాధారంగా జరిగే వేధింపులనుంచి అదృష్టవశాత్తు నేను తప్పుకున్నాను. కానీ రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందంటూ తెలిపారు. అర్జున్‌తో కలిసి ద్విభాషా చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆయనతో కలిసి నటించడం గొప్ప అదృష్టంగా భావించా. కానీ ఓ రోజు రొమాంటిక్ సన్నివేశంలో నటిస్తుండగా నాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆవేదన వెల్లడించారు. సినిమాలో సహజత్వం ఉండాలి కానీ ఇలా చేయడం తప్పు, ఆయన ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదని అన్నారు. నేను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన ఏ నటుడూ నన్ను ఇలా ఇబ్బంది పెట్టలేదు అన్నా

CLICK HERE!! For the aha Latest Updates