HomeTelugu Big Storiesమెగాస్టార్ 'సైరా' ఫస్ట్ రివ్యూ

మెగాస్టార్ ‘సైరా’ ఫస్ట్ రివ్యూ

9 23
మెగాస్టార్ చిరంజీవి, బిగ్‌బీ అమితాబ్ కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా అదిరిపోయిందంటూ ఓవర్సీస్ సినీ బిజినెస్ మ్యాన్ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టటం ఖాయం అని ట్వీట్ చేశారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవితో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి లాంటి హేమాహేమీలైన నటులు, నయనతార, తమన్నా లాంటి అందమైన హీరోయిన్లు ఇందులో కీలక పాత్రలు పోషించారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ మీద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఫోర్ స్టార్స్ ఇవ్వడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu