HomeTelugu Trendingచిరంజీవి సవితి తమ్ముడుగా రవితేజ!

చిరంజీవి సవితి తమ్ముడుగా రవితేజ!

Mega 154 Movie Update
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. జాలరుల గూడెం నేపథ్యంలో ఈ కథ నడవనుందని టాక్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగు మొదలైపోయింది. శృతి హాసన్ హీరోయిన్‌గా అలరించనుంది. ఈ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. అయితే రవితేజ ఈ సినిమాలో.. చిరంజీవికి సవతి తమ్ముడుగా కనిపించనున్నాడని అంటున్నారు. అంటే మణిరత్నం ‘ఘర్షణ’ సినిమాలో మాదిరిగా తండ్రి ఒకరే .. తల్లులు వేరు. రవితేజ పాత్రను కూడా బాబీ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు.

చిరంజీవి – రవితేజ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు గూస్ బంప్స్ తెచ్చేలా ఉంటాయని అంటున్నారు. రవితేజ సరసన కేథరిన్ కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం మీద రవితేజ పాత్ర నిడివి 40 నిమిషాల సేపు ఉండొచ్చని సమాచారం. చిరంజీవిని అన్నయ్య అని పిలిచే రవితేజ, ఆయనకి తమ్ముడి పాత్రలోనే చేస్తుండటం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu