HomeTelugu Trendingమలయాళ టీజర్‌లో తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన స్టార్‌ హీరో

మలయాళ టీజర్‌లో తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన స్టార్‌ హీరో

Aaraattu Teaser
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ”ఆరాట్టు”. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్‌ టీజర్ తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్‌ ఒకే ఒక్క డైలాగ్ ఉండగా… అది కూడా తెలుగు డైలాగ్. టీజర్లో ‘నేను వాడిని చంపేస్తాను’ అంటూ మోహన్ లాల్.. విలన్ ను హెచ్చరించారు . దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్ పాత్ర ఉండి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. మీరు కూడా ఈ పైసా వసూల్ టీజర్ ను వీక్షించండి. ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఐఎఎస్ అధికారిణిగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu