HomeTelugu Big Storiesచిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ షూరూ

చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ షూరూ

Megastar chiranjeevi birthd

సోషల్‌ మీడియాలో మెగా స్టార్‌ చిరంజీవి (ఆగస్టు 22) బర్త్‌డే సందడి మొదలైంది. చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులు ఆయన పాత ఫొటోలను, బర్త్‌డే కవర్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటున్నారు. చిరు ఫొటోతో తమ డీపీలను కూడా మార్చేస్తున్నారు. ఇక చిరు చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లు సైతం క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే, విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు మోహన్‌రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్‌’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ కూడా మొదలైంది.

ఈ సినిమాతో పాటు, మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌ లో ‘వేదాళం’ రీమేక్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఆదివారం ఉదయం 9గంటలకు ‘మెగా యుఫోరియా’ పేరుతో అప్‌డేట్‌ ఇవ్వన్నట్లు తెలిపింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో పాటు, కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తికర విషయాన్ని పంచుకోనుంది. ‘మెగా వేవ్‌’ పేరుతో ఆదివారం సాయంత్రం 4.05గంటలకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. నిలిపి ఉన్న ఓడకు యాంకర్‌ వేలాడుతూ దాని వెనుక చిరంజీవి రూపం ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మరోవైపు చిరంజీవి బర్త్‌డే మోషన్‌ పోస్టర్‌ కూడా ట్రెండింగ్‌లో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu