Megastar Chiranjeevi Guinness Record:
తెలుగు సినీ పరిశ్రమలో నలభై ఆరు సంవత్సరాల క్రితం ఒక అద్భుతం పరిచయమయ్యింది. ఆ అద్భుతం పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి. ఫ్యాన్స్ ప్రేమగా మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటారు. మామూలు హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన చిరంజీవి ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచారు.
ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమను శాసించారు చిరు. ఆయన కెరీర్ లో అందుకున్న విజయాలు అన్నీ కష్టం, పట్టుదలతో నిండినవే. ఆయన కష్టమే ఆయన్ని సినిమా పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే గొప్పవాడిగా మార్చింది.
తాజాగా Megastar Chiranjeevi కి మరో విశిష్ట గౌరవం దక్కింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు చిరు చేసిన తెలుగు సినిమా పరిశ్రమకు అద్భుతమైన కృషిని గుర్తించారు. చిరంజీవి చేసిన ప్రత్యేక డ్యాన్స్ ప్రదర్శనలను గౌరవిస్తూ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బహుమతి అందజేశారు. ఒక భారతీయ నటుడిగా సినిమాల్లో అత్యధిక డ్యాన్స్ ప్రదర్శనలకు ఈ ఘనత దక్కడం విశేషం.
Congratulations to my Mamaya Megastar Chiranjeevi Garu for achieving the Guinness World Record as the Most Prolific Film Star in Indian Cinema, with 156 films and 24,000+ dance moves across 537 songs in 45 years! 👏 #ChiranjeeviGuinnessRecord #MegastarChiranjeevi@KChiruTweets… pic.twitter.com/MhOZg75aAY
— Upasana Konidela (@upasanakonidela) September 22, 2024
ఈ పురస్కారాన్ని స్వయంగా బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ చిరంజీవికి అందించారు. చిరు తన కెరీర్ ఆరంభం నుంచి ఇవాల్టి వరకు ఎప్పటికప్పుడు తన ప్రత్యేకమైన స్టైల్, డ్యాన్స్‌లోని గ్రేస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు.
ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. చిరంజీవి డ్యాన్స్ చేయడం అంటే ప్రేక్షకులకు పండగే. ఆయన సినిమాల్లో పాటలంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. అందుకే ఆయన్ని అభిమానులు మెగాస్టార్‌గా ఆదరిస్తారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేత ఈ గొప్ప గౌరవం పొందటం చిరంజీవి కెరీర్‌లో మరొక మైలురాయి.
Read More: Chiranjeevi బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్ ప్రకటించిన నిర్మాత