HomeTelugu Newsమెగాస్టార్‌ తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుక.. ఫొటోలు వైరల్‌

మెగాస్టార్‌ తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుక.. ఫొటోలు వైరల్‌

13b

మెగాస్టార్‌ చిరంజీ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 29న ఈమె పుట్టిన రోజు. తల్లి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరిపాడు చిరంజీవి. అంజనా దేవితో చిరు ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు చిరంజీవి. ఈ ఫోటోలతో పాటు పలు సందర్భాలలో అమ్మంటే తనకు ఎంత సెంటిమెంట్ అనేది కూడా చెప్పుకొచ్చాడు మన మెగాస్టార్‌. ఇప్పుడు ఆమె జన్మదిన వేడుకలను కూడా అంతే ఘనంగా నిర్వహించాడు. కొరటాల శివ షూటింగ్‌తో బిజీగా ఉన్నా చిరు అమ్మ పుట్టిన రోజు హాజరైయ్యాడు.

13a 1

రోజంతా ఆమెతోనే సరదాగా గడిపాడు. తల్లితో కేక్‌ కట్‌ చేయించి.. సెల్ఫీ దిగుతూ ఉత్సాహంగా కనిపించాడు. ఈ వేడుకల్లో చిరు సతీమణి సురేఖతో పాటు నిహారిక, సుష్మిత సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఫోటోలను మెగా డాటర్ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అలాగే నాయన్నమ్మకు బర్త్‌ డే విషెస్‌ కూడా తెలిపింది. మనవళ్లు, మనవరాళ్లు, కొడుకుతో కలిసి అంజనా దేవి ఆనందంగా గడిపారు.

 

 

View this post on Instagram

Happy birthday Naama..😃🤗

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu