HomeTelugu Newsఅలీని పరామర్శించిన చిరంజీవి

అలీని పరామర్శించిన చిరంజీవి

3 19
స్టార్‌ కమెడియన్‌ అలీని మెగాస్టార్‌ చిరంజీవి పరామర్శించారు. ఈ తెల్లవారుజామున అలీ తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరంలోని ఆయన సోదరి నివాసంలో ఉన్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తన తల్లి చనిపోయిందన్న వార్త విన్న అలీ.. రాంచీ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి.. అలీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిరంజీవితో పాటు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు, పలువురు సినీ నటులు అలీని పరామర్శించిన వారిలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu