HomeTelugu Trendingకొత్తజంటతో మెగాహీరోలు.. ఫొటో షేర్‌ చేసిన చిరంజీవి

కొత్తజంటతో మెగాహీరోలు.. ఫొటో షేర్‌ చేసిన చిరంజీవి

megastar chiranjeevi shared
మెగా వారసుడు వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి వివాహంలో నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సహా కుటుంబ సభ్యులంతా తెగ సందడి చేస్తున్నారు. ఇటలీలోని టస్కానీలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందినవారంతా హాజరయ్యారు. నవదంపతులను ఆశీర్వదించారు.

 

ఇక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవదంపతులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలకు సినీ సెలబ్రిటీల నుంచి ఫ్యాన్స్ వరకు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడాచేరిపోయారు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Photo of chiranjeevi surekha with grand daughter klinkara goes viral

‘..ఆ విధంగా వారు ప్రేమతో నిండిన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. నవ తారల దంపతులకు తారల శుభాకాంక్షలు!’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో కొత్తజంటతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి దిగిన ఒక ఫొటోని ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఉన్నారు. దీంతో ఈ ఫొటోని చూసి మెగా ఫ్యామిలీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu