వినాయక చవితి కానుకగా.. రోబో 2 పాయింట్ ఓ టీజర్‌

సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నరోబో 2 పాయింట్ ఓ టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. సెప్టెంబరు 13 వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు శంకర్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘సెప్టెంబరు 13న రోబో 2 పాయింట్ ఓ టీజర్‌.. త్రీడీ వర్షన్‌లో చూడండి’ అంటూ మూవీ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్, స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో రోబో 2 పాయింట్ ఓ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో సుమారు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ద్వారా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. రోబో 2 పాయింట్ ఓ లో అక్షయ్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే లీకైన రెండు సినిమాల బీబీసీ ఇంటర్వ్యూ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచింది. నవంబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.