బింబిసార- సీతారామం విజయంపై చిరంజీవి స్పందన

మెగాస్టార్ చిరంజీవి.. ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలు ఈ శుక్రవారం విడుదలై మంచి స్పందన దక్కించుకోవడంతో.. సంతోషం వ్యక్తం చేశారు. రెండు సినిమాల నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటను, ఉత్సాహాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తాయని మరోసారి నిరూపించాయన్నారు. సీతారామం, బింబిసార చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరమన్నారు.

కరోనా తర్వాత ఓటీటీలకు డిమాండ్ పెరగడంతో పాటు, సినిమా టికెట్ల రేటు భారీగా పెరిగిన కారణంగా ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. స్టార్ హీరోలు నటించిన పెద్ద చిత్రాలు సైతం బాగా లేకుంటే ఎక్కువ రోజులు థియేటర్లలో నడవటం లేదు. సీతారామం, బింబిసార చిత్రాలు భారీ అంచనాలేమీ లేకపోయినా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates