పూనమ్ కౌర్ వైరల్ ట్వీట్


నటి పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. పూనమ్‌ సినిమాల్లో మానేశాక.. స్వర్ణఖడ్గం అనే సీరియల్‌లో నటిస్తుంది. బాహుబలి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సీరియల్ ద్వారా మరోసారి పాపులర్ అయిన పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం పొలిటికల్ వార్ జరుగుతున్నది. ఈ సందర్భంగా పూనమ్ ట్వీట్ చేసింది. ఆంధ్ర.. తెలంగాణ అంటూ మనవాళ్ళు ఫైట్ చేసుకుంటే దానివల్ల ఎవరికి లాభం ఉండదు.. ఈ ఫైట్ ను చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్ లో చదువుకున్న పిల్లి.. కోతి కథ గుర్తుకు వస్తుంది అని ట్వీట్ చేసింది. దీనిపై వైసీపీ పార్టీకి చెందిన ఓ వ్యక్తి స్పందిస్తూ.. నోటుకు ఓటు వల్ల ఎవరికి నష్టం. మీ ట్వీట్ లో స్పష్టత లేదు. మీ ట్వీట్ వలన టీడీపీకి ఒక్క ఓటు కూడా పడదు” అని ట్వీట్ చేశాడు.

దీనిపై పూనమ్ కౌర్ స్పందించింది.. నువ్వు ఎవరి ఫోటోను డీపీగా పెట్టుకున్నావో వారి విలువ తీయకు. అసభ్య కరమైన పదజాలంతో మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా. అసభ్యకరమైన భాషను ప్రయోగించి పంచ్ లు వేయడానికి ఇదేమి సినిమానా అని ప్రశ్నించింది” పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ ట్వీట్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి.