HomeTelugu Trendingఇక్కడ చిరు.. అక్కడ ప్రభాస్ ఇరగదీశారు..!

ఇక్కడ చిరు.. అక్కడ ప్రభాస్ ఇరగదీశారు..!

3 12
ఈ ఏడాది సెకండాఫ్‌లో రెండు భారీ సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి ప్రభాస్ సాహో సినిమా కాగా, రెండోది మెగాస్టార్ సైరా సినిమా. ప్రభాస్ సాహో సినిమా ఆగష్టు 30న భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఫస్ట్ ఇండియన్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే బాలీవుడ్లో చేసిన ప్రమోషన్లు, టివి షో ప్రమోషన్స్ కారణంగా సినిమాకు కలిసి వచ్చింది. బాలీవుడ్ లో సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి.

టాలీవుడ్ లో ఈ రకమై ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో సినిమా ఇక్కడ అనుకున్నంత హిట్ రాలేదు. మెగాస్టార్ నటించిన సైరా అక్టోబర్ 2 న రిలీజ్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో గ్రాండ్ గా ప్రమోట్ చేశారు. బాలీవుడ్‌లో పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా బాలీవుడ్ కలెక్షన్లు పడిపోగా.. తెలుగులో మాత్రం సినిమా ప్రమోషన్స్ కారణంగా మంచి వసూళ్లు సాధిస్తూ వచ్చింది. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రమోషన్స్ చేయడం సినిమాకు కలిసి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu