HomeTelugu Trendingఆ పాత్రలో మొదటిసారి తమన్నా..!

ఆ పాత్రలో మొదటిసారి తమన్నా..!

8 22‘బాహుబ‌లి’ చిత్రం త‌ర్వాత మిల్కీబ్యూటీ త‌మ‌న్నా సినిమాల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు వహిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల కంటే లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌కు అధిక ప్రాధాన్య‌తనిస్తున్నారు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి 14 సంవత్స‌రాల‌వుతున్న త‌మ‌న్నా తొలిసారి ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీలో న‌టించ‌నున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది దర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్నసంగతి తెలిసిందే. ఇందులో మ‌హిళ‌ల క‌బ‌డ్డీ కోచ్‌గా త‌మ‌న్నా క‌న‌ప‌డ‌తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. డైరెక్ట‌ర్ పాత్ర గురించి చెప్ప‌గానే..తాను ఇప్పటి వరకు చేయని పాత్ర కావడంతో, త‌మ‌న్నా ఏ మాత్రం ఆలోచించ‌కుండా వెంట‌నే ఒప్పుకున్నారట. ప్రస్తుతం ఈ అమ్మడు పాత్ర కోసం క‌బ‌డ్డీ ఆట గురించి తెలుసుకుంటున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu