HomeTelugu Trendingప్రధాని మోదీ ప్రశంసలపై చిరు స్పందన

ప్రధాని మోదీ ప్రశంసలపై చిరు స్పందన

4 3
కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి పలు వీడియోలను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. చిరంజీవి, నాగార్జున కలిసి రూపొందించిన వీడియో వుయ్ గో నా ఫైట్ కరోనా ఏదేమైనా.. పాట విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటలో పాల్గొన్న హీరోలను పేరుపేరునా ప్రశంసిస్తూ వారికి అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టడంలో మా వంతు సహాయం చేస్తున్నామన్నారు. మీ ప్రశంసలకు ధన్యవాదాలు మోదీ గారు అంటూ దేశంలో కరోనా కట్టడికి మీరు చేస్తున్న కృషిలో మావంతు చిన్న సహాయం చేశామని అన్నారు. సంగీత దర్శకుడు కోటితో పాటు మా అందరి తరపున మీకు నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu