HomeTelugu Trendingనాగార్జునకు జంటగా మెహ్రీన్‌!

నాగార్జునకు జంటగా మెహ్రీన్‌!

Mehreen with nagarjuna
అక్కినేని నాగార్జున హీరో.. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం‘ది ఘోస్ట్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్‌కు జోడీగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. దీంతో ఆమె స్థానంలో అమలాపాల్‌ ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ఛాన్స్‌ యంగ్‌ హీరోయిన్‌ మెహ్రీన్‌ వరించినట్లు సమాచారం.

Mehreen 1

ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో కథా చర్చలు పూర్తి చేసిందని, స్క్రిప్ట్‌ నచ్చడంతో నాగ్‌ సరసన నటించేందుకు అంగీకరించినట్లు ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu