HomeTelugu Big Storiesమైఖేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

మైఖేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Michael Bio picమైఖేల్ జాక్సన్ పేరు వింటే కోట్లాది మంది పాప్ మ్యూజిక్ లవర్స్ గుండెలు ఉప్పొంగుతాయి. ఇప్పుడు అలాంటి పాప్ సింగర్ బయోపిక్ రూపొందుతోందంటే ఇంకా ఎంతో హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. తన మ్యూజిక్, పాటలు, బ్రేక్ డ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మైఖేల్ జాక్సన్. ఈ పాప్ కింగ్‌పై బయోపిక్ అంటే సహజంగానే ఎంతో మందిలో ఆసక్తి రేపుతోంది.

గతంలో హాలీవుడ్‌లో బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామాగా వచ్చిన బోహేమియన్ రాప్సోడీ వంటి సూపర్ హిట్ మూవీ నిర్మించిన గ్రాహమ్ కింగ్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌ను నిర్మిస్తున్నాడు. ఇందులో మైఖేల్ జాక్సన్ పాత్రను అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ చేస్తున్నాడు. ఆంటోనీ ఫుఖా డైరెక్షన్‌లో మూవీ రూపొందుతోంది.

తాజాగా మైఖేల్ జాక్సన్ బయోపిక్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జనవరి 22న ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం మైఖేల్ జాక్సన్ బయోపిక్ మాత్రమే కాదు, అతడు తెచ్చిన కళాత్మక విప్లవాన్ని కళ్లకు కట్టినట్లు రూపొందించబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.

మైఖేల్ జాక్సన్ 2009, జూన్ 25న గుండెపోటుతో కన్ను మూశాడు. అప్పటికి అతడి వయసు 50 ఏళ్లు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో తన ఇంట్లోనే మైఖేల్ జాక్సన్ మృతి చెందాడు. అతని మరణంపైనా అనేక అనుమానాలు వచ్చాయి. మైఖేల్ వ్యక్తిగత డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగా చనిపోయాడని కొందరంటే.. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి, డ్రగ్స్‌కు బానిసవడంతోనే మృతిచెందాడని మరికొందరు వాదించారు.

పాప్ సామ్రాజ్యానికి మైఖేల్ జాక్సన్ రాజుగా జీవించినా అతని జీవితంలో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు, చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, డ్రగ్స్ వినియోగం, అప్పులు.. ఇలా అతని చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఈ సున్నితమైన అంశాలను సినిమాలో ఎలా చూపించబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంటుంది.

మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో కొన్ని కోణాలు చూపిస్తారా లేదా అనేది కూడా అనుమానమే. మైఖేల్ జాక్సన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చినా కోర్టులో ఏళ్ల పాటు విచారణ జరిగింది. చివరికి అతడు ఏ తప్పూ చేయలేదని తేల్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu